ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షలు రద్దు చేయాలని ఏఐఎస్​ఎఫ్ నాయకుల నిరసన - aisf protest in ananthapur demanding to not conduct exams

కరోనా విజృంభిస్తున్నా.. ప్రభుత్వం పరీక్షలు పెడతాననటం సరికాదని ఏఐఎస్​ఎఫ్ నాయకులు అన్నారు. కోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వంలో చలనం రాలేదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతోందని మండిపడ్డారు. వెంటనే పరీక్షలు రద్దు చేయాలని.. అనంతపురం జిల్లాలో నిరసన చేపట్టారు.

aisf darna
ఏఐఎస్​ఎఫ్ నాయకుల నిరసన

By

Published : May 1, 2021, 10:13 PM IST

పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని.. అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. కోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వంలో చలనం రాలేదని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతోందన్నారు. పరీక్షలను రద్దు చేయాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తను ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details