ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ బిల్లులు'

వ్యవసాయ బిల్లులపై జిల్లాలవారీగా పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్​ రెడ్డి స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసమే కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని వెల్లడించారు.

'రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ బిల్లులు'
'రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ బిల్లులు'

By

Published : Dec 14, 2020, 6:52 PM IST

రైతు సంక్షేమం కోసమే కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్​ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బిల్లులు అమలైతే...రాబోయే రోజుల్లో వ్యవసాయం దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా తయారవుతుందన్నారు. ఈ దేశ సౌభాగ్యాన్ని పెంచే పరిస్థితికి వ్యవసాయం వస్తుందన్నారు.

గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు స్వేచ్ఛ లేకుండా చేసిందని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో చట్టాలకు అనుమతిచ్చిన వైకాపా, తెదేపాలు భారత్​బంద్​లో పాల్గొని ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. వ్యవసాయ బిల్లులపై జిల్లాలవారీగా పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 18న నంద్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి చట్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details