నీటిగుంతలో పడి యువకుడు మృతి - kuderu crime news
నీటిగుంతలో పడి యువకుడు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో విషాదం జరిగింది. పొలంలో నీటి నిల్వకోసం తవ్వుకున్న నీటికుంటలో పడి... సుబ్రమణ్యం అనే యువకుడు మృతిచెందాడు. పొలంలో పనులు ముగించుకొని చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడానికి నీటికుంట వద్దకు వెళ్లిన సుబ్రమణ్యం... ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవటంతో పొలంలో పనిచేస్తున్న అతని అన్న కుంట వద్దకు వచ్చి చూడగా అప్పటికే సుబ్రమణ్యం మృతిచెందాడు. మృతుడి తండ్రి ఏడాది కిందటే గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు చనిపోవటంతో మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.