ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్తి తగాదాల్లో అన్ననే చంపిన ఓ తమ్ముడు - అన్నను చంపిన తమ్ముడు

ఆస్తి తగాదాల్లో అన్ననే చంపేశాడు ఓ తమ్ముడు. అడ్డు వచ్చిన వారిపై అతని కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. వారిని అరెస్టు చేసి మీడియా ముందుంచారు పోలీసులు.

dispute-over-property
ఆస్తి తగాదాలు

By

Published : Oct 16, 2020, 11:55 AM IST

ఆస్తి విషయంపై చెలరేగిన వివాదంలో అన్ననే చంపాడు ఓ తమ్ముడు. ఉరవకొండ సర్కిల్ పరిధిలోని విడపనకల్ మండలం గాజుల మల్లాపురంలో చెన్నప్ప అనే వ్యక్తిని హత్య చేసినందుకు నిందితుడు చంద్రశేఖర్​తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆస్తి తగాదా విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. అడ్డు వచ్చిన వారిపై అతని కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details