అనంతపురం జిల్లా పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతుడు వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురానికి చెందిన బోయ రాజన్నగా గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధమా లేక పాతకక్షలు ఏమైనా ఈ హత్యకు కారణమా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.