అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలో గొల్ల నరసింహులు అనే రైతు తోటలో ప్రత్యర్థులు చెట్లను నరికివేశారు. 56 మామిడి చెట్లను నరికారని నరసింహులు చెప్పాడు. ప్రత్యర్థుల బెదిరింపులు, దాడులకు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. తెదేపా నాయకుడు ఉమామహేశ్వర నాయుడు రైతు పొలాన్ని పరిశీలించారు. దాడులను అరికట్టకపోతే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
'56 మామిడి చెట్లు నరికివేత.. రైతు ఆవేదన' - papampalli
పాపంపల్లి గ్రామంలో నరసింహులు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పంట భూమిలోని 56 మామిడి చెట్లను ప్రత్యర్థులు నరికివేశారంటూ ఆరోపించాడు.

56 మామిడి చెట్లు నరికివేత