ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రికార్డుల్లో నమోదు కాని నగదు.. 4లక్షలు స్వాహా..!

4 లక్షలు రూపాయలు దాచుకున్న రైతుకు గుంతకల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధికారి టోపీ పెట్టాడు. ఎఫ్​డీ చేసిన డబ్బును రికార్డుల్లోకి ఎక్కించకుండా పక్కదారి పట్టించాడు. బాధితుడు కలెక్టర్​ను ఆశ్రయించటంతో నగదు చెల్లించేందుకు అధికారులు ఒప్పుకున్నారు.

రికార్డుల్లోకి ఎక్కించకుండా ఎఫ్ డీ నగదు స్వాహా

By

Published : Jul 18, 2019, 12:49 PM IST

రికార్డుల్లోకి ఎక్కించకుండా ఎఫ్ డీ నగదు స్వాహా

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయంలో అవినీతి చోటు చేసుకుంది. సహకార సంఘంలో అక్రమాలు జరిగాయని జిల్లా కో-అపరేటివ్ అధికార బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని కొట్టాలకు చెందిన శ్రీనివాసులు 2016లో ఎఫ్​డీ చేసిన రూ.4 లక్షలు చెల్లించడంలో సొసైటీ అధికారులు జాప్యం చేస్తున్నారని.. బాధిత రైతు కలెక్టర్​ను ఆశ్రయించారు. దాంతో జిల్లా కలెక్టర్ నలుగురు అధికారులతో విచారణ చేపట్టగా.. రికార్డుల్లో నమోదు చేయకుండా ఎఫ్​డీ నగదు స్వాహా చేసినట్లు రుజువైంది. కానీ సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జున తనకేమీ తెలియదని.. అప్పటి సంఘం సీఈఓ లక్ష్మీనారాయణ హయాంలోనే అవినీతి జరిగిందంటున్నారు. సంఘానికి చెడ్డ పేరు రాకుండా రైతుకు 3 నెలల వ్యవధిలోనే ఎఫ్​డీ డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తామని అధికారులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details