అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామంలోని ఓ మహిళతో చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే కారణంతో.. ఓ వర్గంపై మరో వర్గం కర్రలు, వేట కొడవళ్లతో దాడికి పాల్పడింది. ఈ నెల 3న ఘటన జరిగింది. అయితే గుత్తి పోలీసులు.. ఈ ఘటనలో 21 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. వారిని ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారందరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ.. గుత్తి సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్ - ananthapur latest news
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామంలోని ఓ మహిళతో.. చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇరువర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 21మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14రోజుల రిమాండ్ విధించింది.
మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్