115 kg Silver in Ganesha in Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడిని ఘనంగా ఊరేగించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన ఈ గణనాథుడిని చవితి వేళ పల్లకిలో ఊరేగించడం సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా 22 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, 115 కిలోల వెండి వినాయకుడికి విగ్రహ దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు మంత్రోచ్చారణలతో కోదండరామస్వామి దేవాలయం వీధి మీదుగా ఊరేగింపు ప్రారంభించారు. గాంధీచౌక్, ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్‌బజార్ మీదుగా స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయానికి తీసుకెళ్లారు. విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి, పంచామృతాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
115 kg Silver Ganesh: గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడికి పూజలు - లిమ్కా బుక్
Silver Ganesha in Limca Book of Records: అనంతపురం జిల్లా గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడిని ఘనంగా ఊరేగించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన ఈ గణనాథుడిని చవితి వేళ పల్లకిలో ఊరేగించడం ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా 22 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, 115 కిలోల వెండి వినాయకుడికి దాత పువ్వాడి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంతకల్లులో 115 కిలోల వెండి వినాయకుడికి లిమ్కా బుక్ ఆఫ్‌లో చోటు
Last Updated : Aug 31, 2022, 3:38 PM IST