అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామంలో విజిలెన్స్ సీఐ విశ్వనాధ్ చౌదరి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒక ఐషర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు గోరంట్ల సీఎస్డీటీ మనోహర్ తెలిపారు. అనంతరం పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని గోరంట్లలోని పౌరసరఫరాల గిడ్డంగికి అప్పగించినట్లు ఆయన వివరించారు.
అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - Ten tonnes of PDS rice seized in vigilance raids
అనంతపురం జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 10 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన పది టన్నుల పీడీఎస్ బియ్యం