ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు స్టేషన్​లోనే గంజాయి దొంగతనం.. ఇంతకీ దొంగ ఎవరంటే.. - ap news

Theft in Police Station: ఏదైనా పోగొట్టుకుంటే మనం పోలీసు స్టేషన్​కి వెళ్తాం. కానీ పోలీసు స్టేషన్​లో భద్రపరిచినదే పోతే ఎవరి దగ్గరకి వెళ్తారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీసులకి ఇటువంటి పరిస్థితే ఎదురైంది. సీజ్ చేసి.. భద్రపరచి.. స్టేషన్​లో పెట్టిన గంజాయి మాయం అయింది. ఏకంగా 200 కిలోలు మాయం అవ్వడంతో పోలీసులు విచారణ జరిపారు. దొంగను కనిపెట్టారు.

police station
పోలీసు స్టేషన్

By

Published : Jan 7, 2023, 2:13 PM IST

Theft in Police Station: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో గంజాయి చోరీ కలకలం రేపింది. సీజ్‌ చేసి భద్రపరిచిన గంజాయిలో కొంత భాగాన్ని కానిస్టేబుల్ మాయం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ కుమార్‌తో పాటు ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్ కుమార్​ని అరెస్ట్‌ అరెస్ట్ చేస్తామన్నారు. దొంగలించిన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముగ్గురు మైనర్లు సహకరించినట్టు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details