School bus accident : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుముప్పు తప్పింది. 40 మందితో వెళ్తోన్న పాయకరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ బస్సును.. డ్రైవర్ పిల్లలను దించేందుకు నక్కపల్లి గురుకుల పాఠశాల ఎదుట నిలిపి ఉంచారు.
అనకాపల్లి లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం - school bus lorry accident in anakapally
School bus accident: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై త్రుటిలో ప్రమాదం తప్పింది. పాయకరావుపేట నుంచి నక్కపల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదే సమయంలో కోడిగుడ్లు సరకుతో విశాఖ వైపు వెళుతున్న లారీ..... బస్సును ఢీ కొట్టింది. ప్రమాదంలో రెండు వాహనాలు పక్కనున్న కాలువైపు దూసుకుపోగా.... ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు హుటాహుటిన సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని విద్యార్థులను మరొక బస్సులో ఇళ్లకు తరలించారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది.
ఇవీ చదవండి: