అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద హైవేపై కారులో తరలిస్తున్న రూ.3కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు.. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. కారులో 3 బాగుల్లో నగదును గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన శ్రీనివాసరావు వద్ద ఏ ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని కారుతో పాటు నగదు స్టేషన్‌కు తరలించారు. అనకాపల్లిలో వేమరాజు నుంచి తీసుకుని అమలాపురంలో ఉన్న పద్మనాభానికి ఇవ్వడానికి వెళుతున్నటు తెలుసుకున్నారు. కేసు విచారణ చేస్తున్నట్టు సీఐ నారాయణరావు తెలిపారు.
ఆధారాలు లేకుండా.. కారులో తరలిస్తున్న రూ.3కోట్లు పట్టివేత - ap news
Seize Cash: ఏ ఆధారం లేకుండా కారులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. కారుతో పాటు నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి నగదును తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టారు.
cash seized