ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"జవాబు చెప్పు- బహుమతి పట్టు" బీబీ పట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం

Javabu Cheppu Gift Pattu Programe in BB Patnam Government High School: పాఠశాలకు వచ్చామా..? వెళ్లామా..? అనే సాధారణ కార్యక్రమానికి భిన్నంగా విద్యార్థుల మేధస్సును పరీక్షించే దిశగా.. అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం బీబీ పట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు 'జవాబు చెప్పు -బహుమతి పట్టు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జవాబు చెప్పు బహుమతి పట్టు కార్యక్రమం తమకెంతగానో దోహద పడుతోందని విద్యార్థులు చెప్పుకొస్తున్నారు.

Javabu_Cheppu_Gift_Pattu_Programe_in_BB_Patnam_Government_High_School
Javabu_Cheppu_Gift_Pattu_Programe_in_BB_Patnam_Government_High_School

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 1:51 PM IST

Javabu Cheppu Gift Pattu Programe in BB Patnam Government High School :పాఠశాలకు వచ్చామా! వెళ్లామా! అనే రొటీన్ కార్యక్రమానికి భిన్నంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రత్యేక తరగతులను నిర్వహించి పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. పాఠశాల సమయం పూర్తయిన తర్వాత చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వారిలో నూతన ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని నింపే విద్యాపరమైన ఆసక్తిని రేపుతున్నారు. దీనిలో భాగంగానే "జవాబు చెప్పు - బహుమతి పట్టు" అని వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రోజు ప్రార్ధన సమయంలో విద్యార్థులకు జనరల్ నాలెడ్జి, గతంలో చెప్పిన పాఠాలకు సంబంధించి కీలకమైన ప్రశ్నలు అడిగి తక్షణమే విజేతకు బహుమతి అందజేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం కోసం విద్యార్థులు పోటీపడి మరి చదువుతున్నారు.

Ilavaram ZPHS English Teacher Hari Krishna: దేశం మెచ్చే విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు.. నాసా శాస్త్రవేత్తలతో మాటలు

Programs To StudentsTeachers Conduct New Programs To Students in Anakapalle District :అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నం అనేది ఓ చిన్న పల్లెటూరు. ఈ గ్రామం పూర్తిగా గంజాయి నేరాలతో ముడిపడిపోయింది. ఈ ప్రాంతానికి చెందిన సుమారు వందమంది గంజాయి నేరాల్లో కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి యువత కూడా అందుకు బానిసలు అయిపోయి వారి బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకుంటున్నారు. ఆ ప్రభావం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులపై పడకుండా ఇక్కడి ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేస్తున్నారు. వారిలో సబ్జెక్ట్​కు అవసరమైన తెలివితేటలను నింపి కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా తయారు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా రోబోలు!

దీనిలో భాగంగా నాలుగు నెలల క్రితం బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులంతా పిల్లల్లో పోటీ తత్వం పెంచి చదువులో మెరుగైన ఫలితాలు కనబరిచేందుకు ఎప్పటికప్పుడు చదువులో సబ్జెక్టులకు సంబంధించి తర్ఫీదునిస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు చదువుతుండగా రోజు ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన వెంటనే ప్రార్థన సమయంలో ప్రశ్నలలో అడిగి విజేతలను అభినందించడంతోపాటు అక్కడికక్కడే బహుమతులను అందజేసి వారిలో పోటీ తత్వాన్ని ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇందుకుగాను పలువురు దాతలు ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి అందజేయడంతో పాటు పలు అంశాలపై ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నారు. వైవిధ్యమైన ఈ విధానం తమకు ఎంతగానో దోహదపడుతోందని, చదువులో పోటీపడే విధంగా సహకరిస్తోందని విద్యార్థులు చెప్పుకొస్తున్నారు.

Jivarallamala Tanda School Teacher Success Story: ఆమె పట్టుదల, కృషి.. గురుకులాల్లో సీట్లు సాధిస్తున్న తండా విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details