ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి ఇంటికి తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ సదుపాయం: ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్ - Internet facility for every village at low cost

Internet facility at low cost: రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, ఉచితంగా బాక్సులు అందిస్తామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ తెలిపారు. సంక్రాంతి తరువాత ప్రతి ఇంటికి కనెక్షన్స్‌ ఇస్తామని... దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు .

ప్రతి గ్రామానికి తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తాం
ప్రతి గ్రామానికి తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తాం

By

Published : Jan 9, 2023, 10:39 AM IST

Internet facility at low cost: ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించా లన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. అనకాపల్లిలోని కేబుల్ ఆపరేటర్​తో ఆయన సమావేశం అయ్యారు. 199రూపాయలకి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బాక్సులు ఉచితంగా అందిస్తామని తెలిపారు. 249రూపాయలకి 50 ఎంబీపీఎస్ స్పీడ్​తో అన్​లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను తక్కువ ధరలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సంక్రాంతి అనంతరం ఈ కనెక్షన్స్ వేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తక్కువ ధరకి అందిస్తున్న ఇంటర్నెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామానికి తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పిస్తాం

ABOUT THE AUTHOR

...view details