ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50వేల 677 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

MLC Madhav on Teacher Posts Vacancies: ఆంధ్రప్రదేశ్‌లో 50వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నోటిఫికేషన్‌ను జారీ చేయాలన్నారు.

BJP MLC Madhav
వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

By

Published : Dec 30, 2022, 7:11 PM IST

MLC Madhav on Teacher Posts Vacancies: ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. డీఎస్సీ విషయంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పిన వైకాపా నేతలు.. అధికారంలోకొచ్చి 3 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ డీఎస్సీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోయారని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యా నాణ్యత తగ్గుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయకుండా, కాలయాపన చేస్తోందని ఎద్దేవా చేశారు. రోజురోజుకు నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల నమ్మకం పోతోందని పేర్కొన్నారు. ఏయే శాఖలలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో వెంటనే ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details