మరోసారి వైకాపాలోకి దాడి వీరభద్రరావు - LOTUS POND
దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కలిసి పార్టీలో చేరారు.
లోటస్ పాండ్
హైదరాబాద్ లోటస్ పాండ్లో దాడివీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ జగన్ను కలిశారు. వైకాపా అధినేతతో చర్చించిన అనంతరం వారు పార్టీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.