ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ పేరిట ప్రత్యేక యాప్ను తీసుకువచ్చింది.
మొబైల్ యాప్
By
Published : Mar 14, 2019, 10:51 PM IST
ఎన్నికల సంఘం మొబైల్ యాప్ విడుదల
ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత బహుమతుల పంపిణీతో పాటు ఇతర అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సీ-విజిల్ పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా మొబైల్ నుంచే చిత్రాలను, వీడియోలను పంపి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును అందుకున్న 100 నిమిషాల్లోనే చర్యలు చేపట్టేలా ఈసీ రూపకల్పన చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 4రోజుల్లో యాప్ ద్వారా 500 ఫిర్యాదులు వచ్చాయి.