ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా.. సరైన సదుపాయాలు లేవు - ఏపీలో గిరిజనులు ఇబ్బందులు

No Transport Facility : ఆ గ్రామాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించాల్సిందే.. స్వాతంత్య్ర వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆ గ్రామాలకు రవాణా సౌకర్యం కలగానే మిగులుతోంది. రహదారులు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లోనూ డోలీమోతలే గత్యంతరం అవుతున్నాయి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గిరిజనుల దుస్థితి..

రోడ్డు లేదు
NO Road

By

Published : Feb 23, 2023, 10:36 PM IST

No Transport Facility : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుంటే.. కొన్ని మారుమూల గ్రామాలు పేదరికమనే చీకట్లోనే మగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి సదుపాయం లేక అలాగే విద్యా, వైద్యంతో పాటు సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గిరిజనుల స్థితి ఇంకా మారలేదు. అక్కడ గ్రామాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సిందే.. ప్రస్తుతం ఆ గ్రామాలకు రవాణా సౌకర్యం అనేది ఒక కలగానే మిగిలింది. సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లోనూ డోలిమోతలే గత్యంతరం అవుతున్నాయి.

పెదబయలు మండలం, కుంతుర్ల పంచాయితీ, మారుమూల గ్రామం కె.బుడ్డపుట్టు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు కూడా రోడ్డు సదుపాయం గురించి పెట్టని దరఖాస్తులు గాని, కలవని అధికారులు కాని లేరు. దీంతో అధికారుల నుంచి స్పందన కరువై చాలాసార్లు అడిగి గ్రామస్థులే సొంతంగా సుమారుగా 5 కిలోమీటర్ల మట్టి రోడ్డును తవ్వుకున్నారు.. అయినా కూడా వర్షాకాలం భారీ వరదలకు మట్టి అంతా కొట్టుకుపోయి పెద్ద పెద్ద గోతులుగా ఏర్పడ్డాయి. వర్షం పడితే చాలు గడ్డ దాటలేక గ్రామస్థులు సుమారుగా 5 కిలోమీటర్లు నడిచి ఊరికి చేరుకోవాల్సి వస్తుంది.

ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి. వర్షాకాలంలో అయితే ఆసుపత్రికి వెళ్లాలంటే రోగిని డోలిలో తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రైవేటు వాహనాలు ఆశ్రయించాల్సిన పరిస్థితి.. వంతెనలు లేకపోవడంతో వాగులు దాటుకొని వెళ్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాగులు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో కొన్నిసార్లు ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచానికి మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తున్న మాటలు వట్టి నీటి మూటలు మిగిలిపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details