Road repairs: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు-కొయ్యూరు గ్రామాల మధ్య రోడ్డు గుంతలు ఎక్కువుగా ఉన్నాయి. ఈ రహదారి పై నిత్యం వాహనాలు తిరగడంతో ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ విషయం స్థానిక ఆటో యూనియన్ సభ్యులు అధికారులకు విన్నవించినా స్పందిచలేదు. దీంతో ఆటో యూనియన్ సభ్యులే చందా వేసుకోని రోడ్డు మరమ్మతులు చేశారు. వీరందరూ కలసి రెండు కిలోమీటర్ల వరకు గోతులు పూడ్చుకున్నారు.
ఆటో యూనియన్ సభ్యులే .. మరమ్మతులు చేసుకున్నారు..
Road repairs : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకుంటూ ఉంటే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ముందుగానే మేల్కోవాాలి. ఆ విధంగానే అధికారులు వచ్చి రోడ్డు పనులు చేస్తారని వేచి చూస్తే ప్రయోజనం లేదనుకొన్నారేమో.. వారే చందా వేసుకొని రోడ్డు గుంతలు పూడ్చకున్నారు.
రోడ్డు పనులు