Officials Dismissed Women Security Guards in Alluri District:కొండ నాలుకకు మందు కావాలని వెళ్తే ఉన్న నాలిక ఊడినట్లు అయ్యింది ఆ మహిళల పరిస్థితి. జీతం తక్కువ వస్తుంది, బకాయి పడిన జీతం కావాలి అని కలెక్టర్ని కలిస్తే చివరికి రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి వారి ఉద్యోగమే కోల్పోయే పరిస్థితి వచ్చింది.. సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్న ఆ మహిళలకు. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలు, కళాశాలలు, ట్రైబల్ బాలికల గురుకులాల్లో 62 మంది సెక్యూరిటీ గార్డులుగా థర్డ్ పార్టీలో సుమారు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. రెండు నెల కిందట తమకు జీతం తక్కువ వస్తుందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పుడు సంబంధిత సూపర్వైజర్ని పిలిచి థర్డ్ పార్టీ నుంచి వచ్చే జీతం 18 వేలకు, 7500 మాత్రమే తక్కువ ఇవ్వడంపై ఆగ్రహించారు.
భోజనంలో పురుగులు, మూడురోజులుగా తాగునీరు లేదు - విద్యార్థినుల ఆందోళన
కలెక్టర్ ఆదేశాలతో మహిళా సెక్యూరిటీ స్టాఫ్ విజయవాడ వెళ్లారు. సెక్యూరిటీ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు. వారు ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చి పంపించేసారు. థర్డ్ పార్టీ తామే ఉంటే లాభ పడవచ్చని స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంలో దిగారు. సెక్యూరిటీ సంస్థ గడువు ముగిసిందని సాకు చెప్పి కొత్త నియామకం చేశారు. పాత వాళ్లకు ఎటువంటి సమాచారం అందించకుండా కొత్తవారికి సెక్యూరిటీ బాధ్యతలు అప్పచెప్పడంతో ఆవేదన చెందారు. పేదవారైన తాము దానిపైనే ఆధారపడుతున్న మహిళా సెక్యూరిటీ గార్డ్స్ కంగుతిన్నారు. ఈ ఘటనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని కలిసి సమస్య వివరించారు. చిరు ఉద్యోగాలపై ప్రజా ప్రతినిధుల పెత్తనం ఏంటని గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.