Italians visiting Onakadilli weekly Market: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఓనకడిల్లి వారపు సంతలో విదేశీ పర్యటకులు సందడి చేశారు. ఇటలీ దేశానికి చెందిన దాదాపు 100మంది వారపు సంతలో కలియదిరిగారు. అక్కడికి వచ్చే బోండా, గదాబ తెగలకు చెందిన గిరిజన మహిళలను చూసి వారు ఆశ్చర్యపోయారు. వారి వేషధారణ నచ్చి ఫొటోలు తీసుకున్నారు. గతం రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల వలన విదేశీ పర్యటకుల సందర్శన నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఆంక్షల సడలింపు తరువాత విదేశీ పర్యాటకం ఊపందుకుంది. పర్యటకుల రద్దీ కారణంగా స్థానిక గిరిజనులకు, లోకల్ గైడ్లకు ఆదాయం పెరుగుతుంది.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో విదేశీ పర్యటకులు.. ఓనకడిల్లి సంతలో సందడి - ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఒనకడిల్లి
Italians visiting Onakadilli Weekly Market: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల ఓనకడిల్లి వారపు సంతలో విదేశీ పర్యటకులు సందడి చేశారు. ప్రతి ఏడాది బోండా, గదాబ తెగలకు చెందిన గిరిజన మహిళల వేషధారణ, ఆచార వ్యవహారాలు చూడటానికి వస్తుంటారు. గురువారం జరిగిన సంతకు దాదాపు 100 మంది ఇటలీ నుంచి వచ్చారు.
విదేశీ పర్యాటకులు