ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 8, 2022, 11:59 AM IST

ETV Bharat / state

Godavari Floods: నిలువ నీడ కూలిపోయే.. నడిరోడ్డే దిక్కాయే

Godavari Floods: కూలిన ఇళ్లు, విసిరేసినట్లు పడున్న పైకప్పులు, పేరుకున్న బురద.. ఇవీ ఆదివాసీ గ్రామాల్లో గోదావరి వరద సృష్టించిన బీభత్సం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి దృశ్యాలను చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Godavari Floods
గోదావరి వరద

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఆదివాసీ గ్రామమైన శబరి కొత్తగూడెంలోని 70 శాతం గుడిసెలు వరద ధాటికి కూలిపోయాయి. కనీసం మొండి గోడలూ మిగల్లేదు. ఇళ్ల పైకప్పులు మాత్రం కొద్ది దూరం కొట్టుకుపోయాయి. సుమారు నెల రోజులుగా గ్రామ ప్రజలంతా చినార్కూరు ప్రధాన, అంతర్గత దారుల పక్కన గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో గ్రామానికి వెళ్లి చూసుకున్నారు. గ్రామాన్ని తిరిగి ఓ రూపునకు తీసుకురావాలంటే కనీసం 3 నెలలు పడుతుందని, అదీ అటవీశాఖ అధికారులు సహకరిస్తేనే సాధ్యమవుతుందని బాధితులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details