JEELUGU KALLU : జీలుగు కల్లు తాగి ఒకరు మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. జీకే వీధి మండలం ఆకులూరిలో జీలుగు కల్లు తాగిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు సప్పర్ల ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో తండ్రి, కొడుకు అపస్మారక స్థితిలో ఉండడంతో చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుమారుడు లోవరాజు (25)మృతి చెందగా తండ్రిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అల్లూరి జిల్లాలో విషాదం.. జీలుగుకల్లు తాగి నలుగురికి అస్వస్థత.. ఒకరు మృతి
JEELUGU KALLU : అల్లూరి జిల్లాలో జీలుగు కల్లు తాగి నలుగురు వ్యక్తులు అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
JEELUGU KALLU