ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమ్మ ఒడి వద్దు.. స్కాలర్​షిప్​ ముద్దు' - పాడేరు తాజా వార్తలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు నిరసన చేశారు. విద్యార్థుల మరణాలపై , ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగింది.

Students of degree colleges protest
విద్యార్థులు నిరసన

By

Published : Dec 9, 2022, 7:48 PM IST

Student Protest: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు నిరసన చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో విద్యార్థుల మరణాలపై విచారణ చేయాలని, విద్యార్థుల ప్రవేశ, పరీక్ష ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థిని, విద్యార్థులకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అమ్మ ఒడి వద్దు.. స్కాలర్​షిప్​ ముద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల మరణాలు తగ్గించాలంటే.. ప్రతి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని కోరారు. ర్యాలీగా వచ్చి పాడేరు ఐటీడీఏ వద్ద నిరసన చేశారు. పోలీసులు గేటు వద్ద విద్యార్థులను అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details