BRITISH CONSTRUCTIONS అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో.. చరిత్రకు అద్దం పట్టే నాటి బ్రిటిష్ కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని సంపదను దోచుకుపోవడానికి.. మొదటగా ఆంగ్లేయులు మన్యంలో వేసిన రహదారులు.. ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. 1916లో నర్సీపట్నం నుంచి లంబసింగి మీదుగా.. చింతపల్లి వెళ్లే ఘాట్ రోడ్ నిర్మాణానికి వేసిన పునాదిరాయి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇక్కడి గిరిజనులపై జరిగే అకృత్యాలే.. అల్లూరి సీతారామరాజును స్వాతంత్య్ర ఉద్యమంవైపు నడిచేలా చేశాయని చెబుతారు. చింతపల్లిలో బ్రిటీషర్ల ఖజానా కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, గవర్నర్ జనరల్ వసతి గృహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. శిథిలావస్థకు చేరడంతో.. వాటిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చింతపల్లిలో బ్రిటీషర్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న దారులు, కట్టడాలు
MANYAM స్వాతంత్య్ర పోరాటంలో మన్యానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలోని అటవీ సంపదపై దృష్టి సారించి నర్సీపట్నం కేంద్రంగా చింతపల్లి మన్యం ప్రాంతాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని నర్సీపట్నం నుంచి లంబసింగి మీదుగా చింతపల్లి వెళ్లే ఘాట్ రోడ్ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇప్పటికీ నిర్మాణానికి వేసిన పునాదిరాయి చెక్కుచెదరకుండా ఉంది.
BRITISH CONSTRUCTIONS