ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకులో పట్టుబడిన 202 కిలోల గంజాయి.. నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్

Seize of ganja: ఒడిస్సా నుంచి ఉత్తర ప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అరకులోయ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒక ఆర్పిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉండటం విశేషం. చెడు వ్యసనాలకు బానిసై అక్రమనంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు ఈ కానిస్టేబుల్ పాల్పడినట్టు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

h
hj

By

Published : Feb 12, 2023, 10:35 PM IST

Seize of ganja: ఒడిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అరకులోయ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కార్లు వరుసగా వస్తుండటంతో అనుమానంగా కార్లను తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఈ లోగా ఒక కారులో నిందితులు ఇద్దరు కారును వేగంగా పోనిచ్చి పారిపోయారు. మరో కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో 202 కిలోల గంజాయి బయటపడింది.

ఈ గంజాయిని ఒడిస్సాలోని పాడువకు చెందిన అనంత రామ్ ఉత్తరప్రదేశ్​కు చెందిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్, రాహుల్ సింగ్ అనే వ్యక్తులకు విక్రయించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ముగ్గురు నిందితులను కారుతోపాటు అరెస్టు చేశామని పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయిని కిలో రెండువేల రూపాయలు చొప్పున నిందితులు కొనుగోలు చేశారని తెలిపారు.

పారిపోయిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తామని త్వరలోనే వీరిని పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.

మాకు రాబడిన సమాచారం మేరకు అరుకు నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని తెలియటంతో వాహనాల తనిఖీలు నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా పాడువ నుంచి విశాఖపట్నం వెళుతున్న రెండు కార్లను ఆపడానికి ప్రయత్నించగా ఒక కారులో ఉన్న నిందితులు పారిపోయారు. మిగతా ముగ్గురిని పట్టుకొని విచారించగా.. గంజాయి తరలిస్తున్నందున పారిపోతున్నట్లు తెలిపారు.

నిందుతులు నరేంద్ర కుమార్ ఆర్పీఎస్ఎఫ్, రాహుల్ సింగ్, అనంతరామ్​ల నుంచి 202 కేజీల గంజాయిని సీజ్ చేసి వారి పై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుంది. - సంతోష్, ఎస్సై

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details