ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

భారత్​ లక్ష్యం 162 - మూడో టీ-ట్వంటీ

హామిల్టన్​ వేదికగా భారత మహిళా జట్టుతో జరుగుతున్న మూడో టీ-ట్వంటీలో కివీస్​ భారీ స్కోరు సాధించింది. టీమిండియా ముందు 162 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారీ స్కోరు దిశగా కివీస్​

By

Published : Feb 10, 2019, 10:09 AM IST

Updated : Feb 10, 2019, 10:31 AM IST

భారత మహిళా జట్టుతో హామిల్టన్​ వేదికగా జరుగుతున్న మూడో టీ-ట్వంటీలో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న అతిథ్య జట్టు న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 161 పరుగుల భారీస్కోరు చేసింది.

ముందుగా ఓపెనర్లు సోఫీ డేవిన్​, సుజీబేట్స్​ కివీస్​కు​ శుభారంభం అందిచారు. తొలి వికెట్​కు 46 పరుగులు జోడించారు. బేట్స్​ను అవుట్​ చేసి అరుంధతి రెడ్డి వీరి జోడీని విడదీసింది. మరో ఓపెనర్​ సోఫీ డివైన్​ దూకుడైన బ్యాటింగ్​తో స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించింది. 52 బంతుల్లో 72 పరుగులు చేసి పెవిలియన్​కు చేరింది. భారత బౌలర్​ దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.వన్డే సిరీస్‌ గెలిచి.. టీ20 సిరీస్‌ను 2-0తో చేజార్చుకున్న భారత మహిళా జట్టు.. చివరిదైన ఈ మ్యాచ్​లో విజయం సాధించి పర్యటనకు ముగింపు పలకాలనుకుంటోంది.

కివీస్​ స్కోర్​: 161/6వికెట్లు

సోఫీ డెవిన్​ 72 ( 52 బంతుల్లో), సూజీ బేట్స్​ 24 (18), హన్నా రోవే 12 (9), ఆమీ సటేర్​వేయిట్​ 31 (23), కేటీ మార్టిన్​ 8 (8), అన్నా పీటర్సన్​ 7 (5 బంతుల్లో నాటౌట్​), లేహ్​ కాస్పెర్క్​ 0 (1), లీ తాహూహూ 5 (4)

భారత్​ బౌలింగ్​: దీప్తి శర్మ రెండు, మాన్సి జోషి, రాధ యాదవ్​, అరుంధతి రెడ్డి, పూనమ్​ యాదవ్​ చెరో వికెట్​ తీశారు.

Last Updated : Feb 10, 2019, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details