ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ముగ్గురు వికెట్ కీపర్లతో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ గెలిస్తే కివీస్ గడ్డపై తొలి విజయాన్నందుకున్న సారిథిగా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.

By

Published : Feb 6, 2019, 12:46 PM IST

భారత్ ఫీల్డింగ్

వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్​లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రోహిత్​ సేన. ఈ మ్యాచ్​లో భారత్ ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. కుల్దీప్ స్థానంలో యుజువేంద్ర చాహల్​ ఆడుతున్నాడు. పాండ్య సోదరులిద్దరూ తుది జట్టులో ఉన్నారు. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యాలతో భారత పేస్​ దళం బలంగా ఉంది. కివీస్ స్టార్ ఓపెనర్ గప్తిల్ గాయంతో మ్యాచ్​కు దూరమయ్యాడు.

ఈ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ-20 విజయం నమోదు చేసిన కెప్టెన్​గా రికార్డుకెక్కుతాడు రోహిత్ శర్మ. 2008-09లో ధోని సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ 0-2తో సిరీస్ ఓటమిని చవిచూసింది.

భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, రిషబ్​ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని(కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్.

న్యూజిలాండ్ జట్టు: కొలిన్ మన్రో, టిమ్ సెఫియర్(కీపర్), కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, డారిల్ మిషెల్, కొలిన్​ డి గ్రాండ్​హోమ్, మిషెల్ సాంట్నర్, స్కాట్ కుగ్లెజిన్, టిమ్ సౌథి, ఇష్ సోధి, లాకీ ఫెర్గ్యుసన్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details