15 పరుగుల వ్యవధిలో పటాపటా మూడు వికెట్లు పడ్డాయి. చూసేవారంతా నాలుగో మ్యాచ్ ఫలితం రిపీట్ అవుతుందనుకున్నారు. అప్పుడొచ్చాడు ఆపద్భాంవుడిలా.. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నాడ్రా బాబు అని అనుకుంటున్నారా..! భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో వన్డే మ్యాచ్ లో అంబటి రాయుడి ప్రదర్శన గురించి.
అతడు లేకుంటే సీన్ రిపీటయ్యేది! - one day
వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశాడు. 113 బంతుల్లో 90 పరుగులు చేసి 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించటంలో ముఖ్య భూమిక పోషించాడు.
న్యూజిలాండ్‌పై విరుచుకుపడ్డ అంబటి రాయుడు
రోహిత్(2), ధావన్(6), శుభమన్ గిల్(7) వచ్చినోడు వచ్చినట్లు పెవిలియన్ బాట పడుతున్న తరుణంలో అంబటి రాయుడు క్రీజులోకి దిగాడు. బంతులను బౌండరీలుగా మళ్లిస్తూ ప్రేక్షకుల్లో ఆటపై ఆశలు నిలిపాడు. మంచి బంతిని వదిలేస్తూ, చెత్త బంతిని దండిస్తూ పరుగుల ప్రవాహం పారించాడు. విజయ్ శంకర్(45) భాగస్వామ్యంతో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. 113 బంతుల్లో 90 పరుగులు చేసిన అంబటి రాయుడు భారత్ గౌరవప్రదమైన లక్ష్యం(252) నిర్దేశించటంలో కీలకపాత్ర పోషించాడు.
Last Updated : Feb 3, 2019, 2:19 PM IST