గుంటూరులో 40వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 40వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి 35 ఏళ్ల నుంచి 90 సంవత్సరాల వయస్సున్న క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. నిన్న నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 10వ తేది వరకు కొనసాగనున్నాయి. ప్రపంచ మాస్టర్ అథ్లటిక్ అసోసియేషన్ అధ్యక్షులు స్టాన్ పర్కిన్స్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలిరోజు 800ల మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, డిస్కస్ తో పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా క్రీడాకారులు చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది.