'ధోనీ' మనసుకు ఏమైంది...? - movie
2014లో హాలీవుడ్లో వచ్చిన 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' చిత్రానికి రిమేక్గా రాబోతుంది 'దిల్ బేచారా' సినిమా.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తోన్న కొత్త చిత్రం పేరు మారిపోయింది. ఇప్పటి వరకు 'కిజి ఔర్ మ్యానీ' అనే టైటిల్ పెట్టిన చిత్రబృందం 'దిల్ బేచారా' గా పేరు మార్చింది. సుశాంత్ సరసన సంజన సంఘీ నటిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
హాలీవుడ్లో 2014లో వచ్చిన 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' చిత్రానికి రిమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, మనోజ్బాజ్పాయ్ తదితరులు నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ ఛాబ్రా దర్శకత్వం వహిస్తున్నాడు.