ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

సూర్య 'ఎన్జీకే​'కు యూ సర్టిఫికేట్​ - చెగువేరాను పోలిన సూర్య పోస్టర్

తమిళ నటుడు సూర్య నటించిన చిత్రం ఎన్​జీకే. ఈ సినిమా టీజర్​ను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సెన్సార్​ బోర్డు అనుమతితో యూ సర్టిఫికేట్​ లభించింది.

ఎన్​జీకే చిత్రంలో సూర్య

By

Published : Feb 13, 2019, 1:38 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 36వ చిత్రం నంద గోపాల కుమారన్​(ఎన్​జీకే). విలక్షణ దర్శకుడు, 7/జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ ఈ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

  • డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి...యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. చిన్నపాటి సెన్సార్​ కటింగ్​లు అనంతరం చిత్రం యూ సర్టిఫికేట్​ పొందింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం 6గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

గతంలో విడుదలైన చెగువేరాను పోలిన సూర్య పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

చెగువేరాను పోలిన సూర్య పోస్టర్

ABOUT THE AUTHOR

...view details