అనిల్ వర్సెస్ అర్జున్ కపూర్ - ani kapoor
బాలీవుడ్లో అనిల్ కపూర్..అర్జున్ కపూర్ ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేయనున్నారు..
వెల్కమ్ బ్యాక్ సినిమా తరవాత అనిల్ కపూర్, జాన్ అబ్రహాం కలిసి నటిస్తున్న సినిమా "పాగల్ పంతీ". అనీజ్ బజ్మి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి షూటింగ్ జరుపుకోనుంది.
పాగల్ పంతీ సినిమాలో ఇలియానా, అర్షద్ వార్షి, పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా, ఊర్వశి రౌతెలా, సౌరభ్ శుక్లా ఇతర పాత్రలో నటిస్తున్నారు.
ఈ యేడాది డిసెంబరు 6న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజు అర్జున్ కపూర్ నటించిన "పానిపట్" కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి ఆశుతోష్ దర్శకత్వం వహిస్తున్నారు.