ఇంట్లో సోఫాలోనో, కుర్చీలోనో కూర్చుని చిప్స్, పాప్‌కార్న్ ఇలా ఏదో ఒకటి తింటూ ఉంటాం. డస్ట్‌బిన్ దాకా వెళ్లి ఆ ప్యాకెట్లు పారేయాలంటే ఒక్కోసారి టీవీలో మంచి కార్యక్రమమేదో వస్తుంటుంది మళ్లీ పడేద్దాంలే అనుకుంటే అవన్నీ సోఫా పక్కనే ఉండిపోతాయి. అలాంటి ఇబ్బంది లేకుండా, అవసరమైనప్పుడు చెత్తడబ్బా మన దగ్గరికి వచ్చి, చెత్త పారేయడం అయిపోగానే మళ్లీ వెనక్కు వెళ్లిపోతే బాగుంటుంది కదూ! ఇప్పుడలా పనిచేసే డస్ట్‌బిన్ కూడా వస్తోంది. ‘గోమిబా గో’ అనే డస్ట్‌బిన్... ఇది చక్రాలు కలిగి ఉంటుంది. రిమోట్ సెన్సర్‌తో పని చేస్తుంది. రిమోట్ ద్వారా డస్ట్‌బిన్‌ను మనం కూర్చున్న చోటికే తెచ్చుకోవచ్చు. తిరిగి మళ్లీ ఏదో ఒక మూలలో పెట్టేయొచ్చు.
ETV Bharat / science-and-technology
మీరెళ్లొద్దు.. డస్ట్‌బిన్నే మీ దగ్గరకు వచ్చేస్తుంది!
ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటాం. లేదా టీవీలో ఏదో కార్యక్రమం ఆసక్తిగా చూస్తుంటాం. చేతిలో ఉన్న పాప్‌కార్న్ ప్యాకెటో.. ఇంకా ఏదైనా.. పడేసేందుకు డస్ట్‌బిన్ దగ్గరకు వెళ్లాలంటే.. ఎందుకులే అనే ఓ ఫీలింగ్. అలాంటప్పుడు డస్ట్‌బిన్ మీ దగ్గరకు వచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది?
walking dustbin