YSRCP_leaders_joining_TDP
LIVE: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు - ప్రత్యక్ష ప్రసారం - CHANDRABABU
<p>YSRCP leaders joining TDP: ఎన్నికల ముంగిట అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి చేరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వలసలు పెరుగుతుండటంతో అధికార వైసీపీకి షాక్‌లు తగులుతున్నాయి. </p><p>తాజాగా పలు నియోజకవర్గాల నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారంతా పార్టీలోకి చేరుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. వీరిలో రైల్వే కోడూరు నుంచి ముక్కు రుపనంద రెడ్డి, కదిరి నుంచి పీవీ పవన్ కుమార్ రెడ్డి, మడకశిర నుంచి ఎంవీ రమేష్, శ్రీకాకుళం నుంచి రెడ్డి చిరంజీవి, చీపురుపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, వారి వారి అనుచరులు ఉన్నారు. వీరంతా వైసీపీలోని ముఖ్యనేతలు కాగా ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోని చేరుతున్నారు. మొత్తం 5 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశంలోకి రానున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి వస్తున్నారు. దీని ప్రత్యక్ష ప్రసారం. </p>
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 1:01 PM IST
|Updated : Jan 18, 2024, 1:22 PM IST
Last Updated : Jan 18, 2024, 1:22 PM IST