ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

పిల్లలే కాదు.. కొన్ని విషయాల్లో పెద్దలూ మారాలి... - పిల్లల పెంపకం వార్తలు

పిల్లల పెంపకం అనేది.. నిజానికి ఎంతో సున్నితమైన అంశం. వాళ్లను మరీ గారాబం చేస్తే మొండిగా తయారవుతారు. అలాగని కాస్త కఠినంగా వ్యవహరిస్తే అమ్మానాన్నలను శత్రువుల్లా చూస్తారు. మరి ఎలా పెంచాలంటారా! అందుకోసమే ఈ సూచనలు.

పిల్లలే కాదు.. కొన్ని విషయాల్లో పెద్దలూ మారాలి...
పిల్లలే కాదు.. కొన్ని విషయాల్లో పెద్దలూ మారాలి...

By

Published : Nov 6, 2020, 11:31 PM IST

పిల్లల్ని ఎప్పుడూ నిందిస్తూ, వాళ్ల తప్పులను వెతికి చూపడమే పనిగా పెట్టుకోకూడదు. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దాంతో తామే పనీ సరిగా చేయలేమనే అభిప్రాయానికి పిల్లలు వచ్చేస్తారు. మీరు అప్పగించిన పనిని వాళ్లు సరిగా పూర్తి చేయలేకపోతే.. మరోసారి ప్రయత్నించి చూడమని ప్రోత్సహించాలి. అంతేగానీ నువ్వీ పని ఎప్పటికీ చేయలేవని నిరుత్సాహపరచకూడదు.

చిన్నతనంలో పిల్లలతో వ్యవహరించిన తీరునే వాళ్లు కాస్త పెద్దయిన తర్వాతా కొనసాగించడం సరికాదు. చిన్న విషయాల్ని పట్టించుకోకుండా వాళ్లు కాస్త స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహించాలి. అవసరమైతే సలహాలు ఇస్తుండాలి గానీ ప్రతి విషయంలో మీరే నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే వాళ్ల వయసును దృష్టిలో పెట్టుకుని మీరూ మారుతుండాలి.

ఏదైనా సమస్యను పరిష్కరించే విషయంలో పిల్లల అభిప్రాయాలనూ అడగొచ్చు. మీకు తోచని విషయం వాళ్ల చిట్టి బుర్రలకు తట్టొచ్చు కూడా. వాళ్లు మరింత ఉత్సాహంగా మీతోపాటు ఆలోచించగలుగుతారు. వారి ఆలోచనా పరిధీ విస్తరిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details