ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

హలో లేడీస్... మిమ్మల్నే... రన్నింగ్​కు వెళ్తున్నారా..? - మహిళా వ్యాయామాలు న్యూస్

నిద్ర లేచింది మొదలు... రాత్రి పడుకునే వరకు నిత్యం ఇళ్లు, ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు మహిళలు. ఈ పనుల్లో పడి... వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. వ్యాయామానికి దూరంగా ఉంటారు. అసలు వ్యాయామానికి సమయం దొరకని మహిళలు చాలామందే ఉంటారంటే అతిశయోక్తి కాదు. కానీ రోజూ కొంత సమయమైనా పరుగెత్తడం వల్ల చాలా లాభాలే ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పరుగెత్తడం కారణంగా... శరీరానికి కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రయోజనాలపై... 'ఎల్బీనగర్ రన్నర్స్' అవగాహన కల్పిస్తున్నారు. అవేంటో చూద్దామా..!

women health tips
women health tips

By

Published : Dec 30, 2019, 12:04 AM IST

సహనశక్తిని పెంచుతుంది...
ప్రతిరోజూ రన్నింగ్ చేయటం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని ఓర్చుకునే శక్తి అభివృద్ధి చెందుతుంది. సహనం పెరగడానికి దోహదపడుతుంది. వ్యాయామం మంచి అనుభూతి కలిగిస్తుంది. శరీరాన్ని కోలుకునేలా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. భావోద్వేగ ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. మానసిక స్థితి సరిగా ఉండటానికి సహాయపడుతుంది.
సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది...
రెగ్యులర్​గా రన్నింగ్ చేయడం ఫలితంగా... చేయి, కంటి సమన్వయాన్ని విస్తరిస్తుంది. శరీర సమతౌల్యానికి సహాయపడుతుంది. కీళ్ల ఆరోగ్యం, లిగ్మెంట్స్, నాడుల శక్తిని పెంచడానికి రన్నింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రన్నింగ్ చేస్తే... తక్కువ వయసు వారిగా కనపడేలా చేస్తుంది. ప్రకాశించే ముఖవర్చసును అందిస్తుంది. రన్నింగ్... వయస్సు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించి... బలమైన శరీర నిర్మాణాన్ని ఇస్తుంది.
డిప్రెషన్ తగ్గిస్తుంది...
రన్నింగ్, వ్యాయామం... డిప్రెషన్, ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది. మీకు మీ గురించి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు... డయాబెటిస్​నూ తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే... రకం-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రన్నింగ్ మంచి నిద్ర రావడానికి సాయపడుతుంది. మీకు ప్రతిరోజు సరైన నిద్ర రాకపోతే రన్నింగ్ చేయటానికి ప్రయత్నించండి.
మెదడుకు పదును...
రన్నింగ్, వ్యాయామం మెదడుకు పదును పెడుతుంది. రన్నింగ్ ఫలితంగా శరీరం అంతటా రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ కారణంగా మెదడు మీరు చేసే పని మీద శ్రద్ధ పెంచుతుంది. ఆమ్లజని, పోషకాలను అందిస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వు కణాలను తగ్గించటానికి వ్యాయామం ఉపకరిస్తుంది. జీవక్రియ సౌలభ్యం, అనవసరమైన కొవ్వును వదిలించుకునే వీలుంటుంది. రన్నింగ్ జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆకలి పెరగటానికి సాయం చేస్తుంది.
గుండెను పదిలం చేస్తుంది...
రన్నింగ్ చేసే మరో మంచి పని... గుండెను పదిలం చేస్తుంది. రన్నింగ్ చేయడం ఫలితంగా... రక్త ప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ హృదయ సంబంధిత రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా... ఒత్తిడి తగ్గిస్తుంది. ఎముకల వ్యాధులు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. కాళ్లు, తొంటి ఎముకల బలాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం. ఎంతో మేలు చేసే రన్నింగ్​కు మీరు వెళ్లండి. ఇన్నాళ్లు ఈ అలవాటు ఉన్నావాళ్లు జాగ్రత్తలు పాటిస్తూ... వ్యాయామం చేయండి. అలవాటు లేనివారు 2020 నుంచి రన్నింగ్​ వెళ్లడం ప్రారంభించండి. నూతన ఏడాదిలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించండి.

హలో లేడీస్... మిమ్మల్నే... రన్నింగ్​కు వెళ్తున్నారా..?

ABOUT THE AUTHOR

...view details