ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

'ఫేస్ ఐడీతో వాట్సాప్ సమాచారం సేఫ్' - safe

వ్యక్తిగత గోప్యతకు వాట్సాప్ కొత్త సాంకేతికత ముందుకు తీసుకొచ్చింది. ముఖచిత్ర గుర్తింపు టచ్ ఐడీలను ఐ ఫోన్ మోడల్స్​కు అనుసంధానించింది.

వాట్సాప్ సమాచారం సేఫ్

By

Published : Feb 6, 2019, 1:58 PM IST

వాట్సాప్ సమాచారం సేఫ్
మీ వాట్సాప్ సమాచారం వేరేవాళ్లు తస్కరిస్తున్నారా! మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా! మీ సందేశాలు చోరీకి గురయ్యాయని అనుమానమా! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెచ్చింది వాట్సాప్. వ్యక్తిగత గోప్యత, సమాచారం భద్రతలపై కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వేరే వాళ్లు మీ చరవాణిలోని వాట్సాప్ సందేశాలు, సమాచారం లాంటివి తస్కరించకుండా ముఖ్యచిత్ర గుర్తింపు, టచ్​ఐడీలని ముందుకుతెచ్చింది వాట్సాప్ సంస్థ. ఐ ఫోన్ 5 ఎస్ నుంచి అన్నీ ఐఒఎస్ మోడల్స్​లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుంది.
వాట్సాప్ ఫీచర్ ఉన్న ఐ ఫోన్​లలో ఈ అనువర్తనానికి సంబంధించిన సెట్టింగ్లను మార్చుకుంటే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. ఈ విధానంతో సమాచార భద్రతే కాకుండా, వ్యక్తిగత గోప్యతకూ భంగం వాటిల్లిందని స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details