ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

ఫేస్​బుక్​లో వాట్సాప్​ తరహా డిలీట్​ ఆప్షన్​

మెసెంజర్​లో స్నేహితులకు పంపిన సందేశాన్ని డిలీట్ చేసుకునే సదుపాయం కల్పించింది ఫేస్​బుక్. సంభాషణ జరిగిన 10 నిమిషాలలోపు మెసేజ్ తొలగించుకోవచ్చు.

ఫేస్​బుక్​లో డిలీట్​ ఆప్షన్​

By

Published : Feb 6, 2019, 5:34 PM IST

ఫేస్​బుక్​లో డిలీట్​ ఆప్షన్​
మీరు ఫేస్​బుక్ చాటింగ్ చేస్తారా? మెసెంజర్​లో పంపిన సందేశాన్ని ఎప్పుడైనా తొలిగించారా? ఇప్పటివరకైతే వీలుపడదు. మన అకౌంట్​లో డిలీట్​ అవుతుంది. కానీ మన నుంచి సందేశం అందుకున్న వారి ఇన్​బాక్స్​లో అలానే ఉంటుంది. ఇప్పుడా సమస్య లేదు.. మెసెంజర్​లో మీరు పంపిన సందేశాన్ని డిలీట్​ చేసే సదుపాయం కల్పించింది ఫేస్​బుక్..! అదేనండి మన వాట్సాప్​లో మెసేజ్​ని డిలీట్ చేసినట్లు సులభంగా తీసేయొచ్చు.
చాలా సార్లు పొరపాటున ఒకరికి పంపాల్సిన సందేశాన్ని మరొకరికి పంపిస్తుంటారు. తర్వాత పశ్చాత్తాపం చెందినా ఫలితం ఉండదు. ఇకపై ఫేస్​బుక్ మెసెంజర్​లో సందేశం పంపిన తర్వాత ఓ విండో ఒపెన్ అవుతుంది. అనంతరం ఆ సందేశాన్ని క్లిక్ చేసినపుడు 'రి మూవ్ ఫర్ ఎవ్రీ వన్' అనే ఆప్షన్ ద్వారా తొలగించవచ్చు. మెసేజ్ తీసేయడానికి 10 నిమిషాల సమయమిస్తుంది. ఈలోపు ఇష్టం లేకుంటే డిలీట్ చేయొచ్చు.
ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జూకర్​బర్గ్ కూడా ఈ సదుపాయం ద్వారా తను పంపిన సందేశాలను విజయవంతంగా డిలీట్ చేయగలిగారని సంస్థ తెలిపింది. అన్ని ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్స్​లో ఫేస్​బుక్ మెసెంజర్ యాప్​లోని ఫీచర్​ని వినియోగించుకోవచ్చు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details