ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

ఏ సందర్భానికి ఏ బ్యాగు బాగుంటుందో తెలుసా..! - ఫ్యాషన్​

అన్ని అవసరాలకూ, సందర్భాలకూ ఒకటే బ్యాగుని ఎంచుకుంటే ఏం కొత్తదనం ఉంటుంది చెప్పండి. అసలు ఏ సందర్భానికి ఏవి బాగుంటాయో తెలిస్తే... వాటిని ఎంచుకుని ఎంచక్కా మెరిసిపోవచ్ఛు.

special-story-
special-story-

By

Published : Aug 24, 2020, 7:11 PM IST

టోటే...:

చూడ్డానికి కాస్త పొడవుగా, పెద్దగా ఉండే ఈ రకం బ్యాగుని రెగ్యులర్‌ వేర్‌గా వాడొచ్ఛు అన్నిరకాల దుస్తులమీదకూ ఇది ట్రెండీ లుక్‌ని తెచ్చిపెడుతుంది.

సాచెల్స్‌...:

డబుల్‌ హ్యాండిల్‌తో విశాలంగా ఉండే ఈ బ్యాగుల్లో అవసరమైన నివేదికలు, మేకప్‌, లంచ్‌బాక్స్‌ వంటివన్నీ సౌకర్యంగా పెట్టుకోవచ్ఛు అధికబరువుని ఆపగలిగే దీన్ని కూడా రెగ్యులర్‌గా వాడుకోవచ్ఛు

స్లింగ్‌:

చిన్న, మధ్యస్థ పరిమాణాల్లో ఉండే ఈ బ్యాగు వేసుకునేవారి లుక్‌నే మార్చేస్తుంది. చేతిలో ఇమిడిపోయే హ్యాండిల్స్‌, భుజాలకు సౌకర్యంగా తగిలించుకునే పొడవాటి స్ట్రాప్స్‌ దీని ప్రత్యేకత. పెట్టుకోవలసిన వస్తువులు పెద్దగా లేనప్పుడు ప్రయాణాలకూ, పార్టీలకూ చక్కగా నప్పుతుంది ఈ రకం.

బ్యాక్‌ప్యాక్‌:

కాలేజీ అమ్మాయిలకే కాదు, యువ ఉద్యోగినులకూ ఇవెంతో సౌకర్యం. సౌకర్యంతో పాటు సొగసుగా కనిపించే వీటిల్లో వెనక తగిలించుకునే స్టైల్స్‌తో పాటు హ్యాండ్‌బ్యాగ్‌లా భుజానికి తగిలించుకునే రకాలూ ఉన్నాయి.

ఇదీ చూడండి :విజయనగరం గిరిజనుల ఆదర్శ'బాట'కు సోనూసూద్ ఫిదా

ABOUT THE AUTHOR

...view details