ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

నిరాశలో ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీలు

కరోనా మహమ్మారితో వేడుకలు, ఉత్సవాలు కళ తప్పిపోయాయి. లాక్​డౌన్​ వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీలు కొత్త ఏడాదిపై పెట్టుకున్న ఆశలూ అడియాశలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలను నిషేధించడం వల్ల ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీల నిర్వాహకులు.

no celebrations for new year
నిరాశలో ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీలు

By

Published : Dec 28, 2020, 12:44 PM IST

అదీ.. ఇదీ అని తేడా లేకుండా కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇప్పుడిప్పుడే మహమ్మారి పంజా నుంచి ఆర్థికంగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. వేడుకలు, ఉత్సవాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయని సంబురపడ్డ ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీలు నూతన ఏడాది వేడుకలు నిషేధించడంతో ఒక్కసారిగా కూలబడ్డాయి.

తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని ప్రకటించడం వల్ల ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీల నిర్వాహకులు నిరాశ చెందారు. గతంలో న్యూ ఇయర్ వేడుకలకు ఒక ఈవెంట్​కు రూ.10 నుంచి రూ.15 కోట్ల దాకా టర్నోవర్ ఉండేదని, ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు అనుమతించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details