కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రంగస్వామి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ... రహదారిపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు.
తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే రంగస్వామి మృతి చెందగా... పాదచారుడికి కాలు, చేయి విరిగాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నందవరం మండలం ఇబ్రహీంపురం వాసిగా గుర్తించారు.