ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

విజయవాడలో యువతి సజీవదహనం..చికిత్స పొందుతూ యువకుడు మృతి

ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతిని సజీవదహనం చేసిన ఘటన విజయవాడలో జరిగింది. సోమవారం రాత్రి 8 గంటలకు యువతిపై పెట్రోల్​ పోసి నాగభూషణం అనే వ్యక్తి నిప్పంటించాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా... అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు.

woman set on fire in vijayawada
woman set on fire in vijayawada

By

Published : Oct 13, 2020, 3:05 AM IST

Updated : Oct 13, 2020, 10:56 AM IST

దారుణం: విజయవాడలో యువతి సజీవదహనం

ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మళ్లీ ఆమె జోలికిరానని యువకుడు రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకుంది. తన ప్రేమను కాదనడమే కాకుండా... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు మాటు వేసి ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోయింది. నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం నాగభూషణం మృతి చెందాడు.

పోలీసులకు ఫిర్యాదు...

కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్​లో నర్సుగా పని చేస్తుంది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె నాలుగు రోజుల కిందట గవర్నర్​పేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు... పోలీసులు ఆ యువకుడ్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెను ఏమీ చేయనని రాసిచ్చినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.

మాటు వేసి కాటేశాడు..

రోజులానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్​ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అతనికీ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం మృతి చెందాడు.

ఇదీ చదవండి

పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు.. అంతలోనే..!

Last Updated : Oct 13, 2020, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details