సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన ఓ వీఆర్ఏ భార్య కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది. చిట్కుల్లో వీఆర్ఏగా పనిచేస్తున్న అశోక్ భార్య సుమలత.. ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పరిశ్రమకు వెళ్తున్న సుమలతను పనికి వెళ్లవద్దని చెప్పి మాన్పించాడు. దీనికి తోడు ఇంటి ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా మద్యం తాగేవాడు.
ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులతో వివాహిత బలవన్మరణం
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబకలహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆపై ఆర్థిక ఇబ్బందులు తోడై విరక్తి చెందిన ఓ వీఆర్ఏ భార్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో జరిగింది.
vra-wife-suicide-at-patancheru-in-sangareddy-district
ఈ విషయమై భార్యభర్తలిద్దరూ తరచూ కొట్లాడుకోగా... మూడురోజుల క్రితం ఈ వివాదాన్ని బంధువులు సర్దిచెప్పారు. జీవితంపై విరక్తి చెందిన సుమలత... శనివారం తెల్లవారుజామున ఇంట్లో దూలానికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.