అనంతపురం జిల్లా తనకల్లు మండలం బొంతల పల్లి గ్రామ వాలంటీర్ హరిబాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హరిబాబును చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ... ఆదివారం మృతి చెందాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి వాలంటీర్ ఆత్మహత్య
పురుగుల మందు తాగి గ్రామ వాలంటీర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో చోటుచేసుకుంది.
పురుగుల మందు తాగి వాలంటీర్ ఆత్మహత్య