రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా సెల్‌ఫోన్ కంటైనర్ లూటీ కేసులో మధ్యప్రదేశ్ కంజర్‌భట్ ముఠాకు చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు పోలీసుల పరిధిలో ఉన్న కంజర్‌భట్ ముఠాకు చెందిన ఇద్దరు నిందితులు మోహిత్ జంజా, రోహిత్ జహల్లాలను నల్లపాడు పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి గుంటూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరిగి వారిని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.
సుమారు రూ.81 లక్షల విలువగల సెల్ఫోన్లు..
గత నెలలో గుంటూరు శివారు ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై శ్రీ సిటీ నుంచి కోల్‌కత్తాకు వెళ్తున్న సెల్‌ఫోన్ కంటైనర్ వెనుక డోరును పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం సుమారు రూ. 81 లక్షల విలువైన సెల్‌ఫోన్లను కొల్లగొట్టిన కేసును ఇప్పటికే పోలీసులు ఛేదించారు.