సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ హాజరయ్యారు. నకిలీ, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 41ఏ సీఆర్పీసీ కింద రవిప్రకాశ్‌కు ఇదివరకే సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆచూకీ కోసం గాలించారు. విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
హైదరాబాద్ పోలీసుల ముందుకు రవిప్రకాశ్! - రవిప్రకాశ్
ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అభియోగాలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్.. హైదరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యారు.
ఈ కేసుల విషయంలో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం సోమవారం సుప్రీంలో పిటిషన్ వేశారు. హైకోర్టుకే వెళ్లాలని రవిప్రకాశ్‌కు సుప్రీం సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 41ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌ను సుప్రీం ఆదేశించింది. అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయంస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ సైబరాబాద్ క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.