హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి అవుట్ పేషంట్ వార్డులోని చెత్తడబ్బాలో పసికందు లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును పడేసి పోయారు. పరీక్షల కోసం పాపను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
తెల్లవారుజామున బురఖా ధరించిన మహిళ.. చెత్తకుండీలో పడేసినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఉదయం క్లీనింగ్ సిబ్బంది శిశువును గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.