తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోని ప్రధాన రోడ్డులో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మధిర - వైరా ప్రధాన రహదారిలో నవయుగ హోటల్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.
వేగంగా ఢీకొట్టడం వల్ల... ట్రాక్టర్ గాల్లోకి ఎగిరి పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న ఆత్కూరుకు చెందిన వెంకట రామ నరసయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.